*తిరుపతి జిల్లా – తిరుపతి టౌన్*
*సెప్టెంబర్ 25, 2026*
*చిత్తూరు పీటీసీ పాసింగ్‌ఔట్ పరేడ్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆహ్వానం*
తిరుపతిలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని* పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి, *చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ)లో నిర్వహించనున్న పాసింగ్‌ఔట్ పరేడ్ కార్యక్రమానికి* హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా *పాసింగ్‌ఔట్ పరేడ్‌కు* సంబంధించిన ఆహ్వాన పత్రికను *మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి* అందజేసి, కార్యక్రమ వివరాలను తెలియజేశారు. పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బంది పాసింగ్‌ఔట్ పరేడ్ కార్యక్రమానికి మంత్రి హాజరై వారిని ఉద్దేశించి ప్రసంగించి, శుభాకాంక్షలు తెలియజేయాలని పోలీసు అధికారులు కోరారు.
పోలీసు అధికారుల ఆహ్వానాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్వీకరించారు.


