(*పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ*) ఆగస్టు ఒకటి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం
పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ముందస్తుగా ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పరస్పరం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని స్నేహ బంధాన్ని చాటుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్రప్రసాద్ చిన్నారులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి, స్నేహం యొక్క గొప్పతనం, ఒకరికొకరు సహకరించుకోవడం, ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం వంటి విలువలను వివరించారు.
మంచి స్నేహితులు జీవితంలో విజయానికి బలమైన ఆధారమని, ఎల్లప్పుడూ నిజాయితీ, నమ్మకం, పరస్పర గౌరవంతో స్నేహాన్ని కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డీన్ చంద్రశేఖర్, ప్రైమరీంచార్జ్ దివ్య, ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శ్రీలక్ష్మి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ లావణ్య,
ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు



