నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో దర్గామిట్ట పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు మరియు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై Immoral Traffic (Prevention) Act, 1956 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని దర్గామిట్ట పోలీసులు తెలిపారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.

మాగుంట లేఅవుట్లో వ్యభిచార ముఠాపై దర్గామిట్ట పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్