శ్రీ కాళహస్తి, జూన్ 28, (పున్నమి న్యూస్) : ప్రతి బూత్, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కోలా ఆనంద్ పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఆదివారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో మండల అధ్యక్షుడు భగీర్తి వెంకటేష్, ఎంపల్ల భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో, మాధవమాలలో వల్లేటి వీరస్వామి, నవీన్ నేతృత్వంలో, జగ్గరాజపల్లిలో రమేష్, శంకరయ్యల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఏర్పేడు మండలం పల్లంపేటలో మండల అధ్యక్షుడు తిరుమలశెట్టి నరేష్, పెంచలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోలా ఆనంద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని, ప్రతి గ్రామంలో పార్టీ సిద్ధాంతాలు, జాతీయ భావనను ప్రజలకు చేరవేయడంలో ‘మన ఊరు–మన జెండా’ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేసి ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కూనాటి నాగరాజు, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, సీనియర్ నాయకులు ధర్మయ్య యాదవ్, కుప్పా ప్రసాద్, లోకేష్ యాదవ్, చొక్కాని రామ్మూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మన ఊరు–మన జెండా’తో గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతం-కోలా ఆనంద్