కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పలు డివిజన్లలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్
కూకట్‌పల్లి, ఆగస్టు 15: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొని త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు.
మోతీనగర్, గాయత్రి నగర్, జనసేన పార్టీ కార్యాలయం (5వ ఫేజ్), బాలాజీనగర్ డివిజన్‌లోని టెంపుల్ బస్‌స్టాప్, బాలానగర్, బోయిన్‌పల్లి, ఫతేనగర్, భారత్‌నగర్, అల్లాపూర్ డివిజన్లలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు kmచేసుకోవాలని అన్నారు. యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు, వివిధ డివిజన్ల నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఆయా ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.


