Sunday, 16 August 2026
  • Home  
  • మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- మేడ్చల్ – మల్కాజిగిరి

మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రజా సేవే దేశ సేవ.. సమష్టి బాధ్యతతో పనిచేయాలి: కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎంసీ కమిషనర్‌  టి. వినయ్‌ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించగా అధికారులు, సిబ్బంది దేశభక్తి స్ఫూర్తితో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి తమ జీవితాలను అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని అన్నారు. స్వాతంత్ర్యం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, బాధ్యత, సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ విధుల్లో, వ్యక్తిగత జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవ కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదని, దేశం మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యత, నిబద్ధతకు ప్రతీక అని కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని, మున్సిపల్‌ సేవల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రజా సేవే దేశ సేవ.. సమష్టి బాధ్యతతో పనిచేయాలి: కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి
మల్కాజ్‌గిరి, ఆగస్టు 15: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎంసీ కమిషనర్‌  టి. వినయ్‌ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం చేశారు.
అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించగా అధికారులు, సిబ్బంది దేశభక్తి స్ఫూర్తితో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి తమ జీవితాలను అంకితం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛా భారతదేశం లభించిందని అన్నారు. స్వాతంత్ర్యం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వం, బాధ్యత, సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ విధుల్లో, వ్యక్తిగత జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ప్రజా సేవ కేవలం ఉద్యోగ బాధ్యత మాత్రమే కాదని, దేశం మరియు ప్రజల పట్ల ఉన్న బాధ్యత, నిబద్ధతకు ప్రతీక అని కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందేలా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం, పచ్చదనాన్ని పెంపొందించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి సమన్వయంతో కృషి చేయాలని, మున్సిపల్‌ సేవల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కమిషనర్‌ సూచించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.