Sunday, 26 July 2026
  • Home  
  • భోగాపురం ప్రధాని పర్యటనకు ఆశీష్ లాల్‌కు కీలక బాధ్యతలు
- తూర్పు గోదావరి

భోగాపురం ప్రధాని పర్యటనకు ఆశీష్ లాల్‌కు కీలక బాధ్యతలు

తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 25: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో సాలూరు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశీష్ లాల్‌ను పార్టీ నాయకులు అభినందించారు. టీడీపీ నాయకుడు నామా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసే బాధ్యతను ఆశీష్ లాల్‌కు అప్పగించడం అభినందనీయమన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమవుతుందని, ఉపాధి, పరిశ్రమలు, పర్యాటక రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సాలూరు నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆశీష్ లాల్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రధాని పర్యటనను ఘనంగా నిర్వహిస్తానని తెలిపారు.

తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 25:
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో సాలూరు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి ఆశీష్ లాల్‌ను పార్టీ నాయకులు అభినందించారు. టీడీపీ నాయకుడు నామా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసే బాధ్యతను ఆశీష్ లాల్‌కు అప్పగించడం అభినందనీయమన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమవుతుందని, ఉపాధి, పరిశ్రమలు, పర్యాటక రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సాలూరు నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆశీష్ లాల్ మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాయకులు, కార్యకర్తల సహకారంతో ప్రధాని పర్యటనను ఘనంగా నిర్వహిస్తానని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.