సత్తుపల్లి / ఖమ్మం
భేతవల్లి ప్రాంతంలో చేపడుతున్న భూ సర్వేను పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ణి వీరంరాజు, సత్తుపల్లి రూరల్ మండల అధ్యక్షుడు సాలి శివకృష్ణ డిమాండ్ చేశారు. వందల ఎకరాల సీలింగ్ భూముల క్రయవిక్రయాలు, అనధికార సర్వేలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. సీలింగ్, అసైన్డ్, ప్రభుత్వ భూములు నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారితే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రికార్డుల్లోని విస్తీర్ణం, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రస్తుత ఆధీనంపై సమగ్ర పరిశీలన జరపాలని సూచించారు. భూ సర్వే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా జరగాలని, ప్రతి సర్వే నంబర్ వివరాలను బహిర్గతం చేయాలని భాస్కర్ణి వీరంరాజు, సాలి శివకృష్ణ, పడిగల మధుసూదన్‌రావు, నాయుడు రాఘవరావు, చీకటి వసంతరావు కోరారు.

