*నేదురుమల్లితో వైయస్సార్సీపి శ్రేణులు భేటీ*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 29 వాకాడు మండలం,*
*వెంకటగిరి నియోజవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాకాడు లోని నేదురుమల్లి నివాసంలో ఉండడంతో వాకాడు, కోట,చిట్టమూరు మండలాలకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భారీగా ఆవుతోకలు జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదని రామ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రామ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ లో జరుగుతున్న లోపాలను గురించి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి దానికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా చేస్తానని వాకాడు,కోట,చిట్టమూరు మండలకు చెందిన వైఎస్సార్సీపి నాయకులకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.



