ఖానాపురం MRPS నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుని అనంతరం మాదిగ ప్రజలు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగూరి ఆనందరావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి కల్లెపల్లి ప్రణయ్‌దీప్ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగల హక్కుల సాధనకు 30 ఏళ్లుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన అధ్యక్షులు మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదమలు తెలియజేసారు ఈకార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ ఖానాపూర్ MRPS ప్రధానకార్యదర్శి వేల్పుల కృష్ణ రాదారపు నవీన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు


