*భర్త ఉన్నాడు… అయిన పక్కనోడి మోజులొపడి ..అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది…మధ్య లో సీన్ రివర్స్ ….నమ్మించి ప్రియుణ్ణి భర్త తో కలిసి లేపేసింది!..ఇలా ఉంటాయి మరీ?*
పల్నాడు జిల్లా పసుమర్రు గ్రామానికి చెందిన జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి టింకరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి చిలకలూరిపేట రెడ్ల బజార్‌లో నివాసం ఉండే కాలేషా వలి భార్య మనీషాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మనీషా భర్త కాలేషా వలికి తెలియడంతో భార్యను తీవ్రంగా హెచ్చరించాడు. వారి సంబంధానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో అక్కడి నుండి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు కాపురం మార్చాడు.
అయినప్పటికీ, జాకీర్ హుస్సేన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. కొత్త ఇంటికి కూడా వస్తూ మనీషాతో సంబంధాన్ని కొనసాగించాడు. దీంతో భర్త ఒత్తిడి మేరకు మనీషా.. ఇకపై తన ఇంటికి రావద్దని జాకీర్‌కు స్పష్టం చేసింది. అయినా జాకీర్ వినకపోవడంతో, విసిగిపోయిన మనీషా ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో ఎలాగైనా జాకీర్ హుస్సేన్‌ను వదిలించుకోవాలని భార్యాభర్తలిద్దరూ కలిసి హత్యకు వ్యూహం రచించారు.
ఈ నెల 1వ తేదీన మనీషా పథకం ప్రకారం జాకీర్ హుస్సేన్‌కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయలుదేరిన జాకీర్ తిరిగి రాలేదు. ఇంటికి వచ్చిన జాకీర్‌పై కాలేషా వలి, మనీషా ఒక్కసారిగా దాడి చేశారు. మెడకు తాడుతో ఉచ్చు బిగించి, చెక్కతో బలంగా కొట్టడంతో జాకీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఒక ఆటోలో తీసుకెళ్లి వేలూరు – జాలాది రహదారి పక్కన పడేసి పరారయ్యారు.
ఇంటి నుంచి వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన జాకీర్ హుస్సేన్ భార్య షఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన వేలూరు – జాలాది రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆనవాళ్లు సేకరించి, షఫియాను పిలిపించి చూపించగా అది జాకీర్ హుస్సేన్ మృతదేహమేనని నిర్ధారణ అయ్యింది.
తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేసిన షఫియా… కాలేషా వలి భార్య మనీషాతో తన భర్తకు ఉన్న వివాహేతర సంబంధం గురించి పోలీసులకు వివరించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులైన కాలేషా వలి, మనీషాలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. పోలీసుల విచారణలో భార్యాభర్తలిద్దరూ తామే దారుణానికి ఒడిగట్టినట్లు తప్పు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

