పున్నమి ప్రతినిధి,రామచంద్రపురం
సాయం సంధ్య వేల దోష నివారణకు ప్రదోషకాలం పూజలు ఆది దంపతులకు అత్యంత ప్రీతికరమని మండల టిడిపి మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు. శివపార్వతుల మీద భక్తి శ్రద్ధలతో 16వ సోమవారాల ప్రదోక్షకాల పూజ దీక్షను నిర్వహించారు. చివరి సోమవారంఅత్యంత భక్త శ్రద్ధలతో తమ గృహంలో మాడభూషి ప్రదీప్ అయ్యంగార్ అర్చక బృందం చే శివలింగానికి, నందీశ్వరులకు పాలు గంధం తేనె పెరుగు విభూది సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం స్వామి అమ్మవార్ల చిత్రపటానికి శివలింగానికి విశేషాలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలచెరువు గ్రామస్తులు, మండల ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించానన్నారు. మేకల మాధవి తిరుమలరెడ్డి దంపతులు పూజలో పాల్గొన్న మహిళ భక్తులకు పొందరు పసుపు కుంకుమ తాంబూలాలిచ్చి ఆశీర్వాదం పొందారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. భక్తులందరికీ అన్నదాన వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొన్నారు.






