నేల కొండ పల్లి /ఖమ్మం
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు మీగడ గోపి నియమితులయ్యారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుళ్ళ వెంకటేశ్వరరావు ప్రకటించిన జిల్లా కార్యవర్గంలో గోపికి ఈ బాధ్యతలు అప్పగించారు. గతంలో బీజేపీ నేలకొండపల్లి మండల కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా గోపి పనిచేశారు. 2019లో ఎంపీటీసీగా పోటీ చేశారు. ఈ సందర్భంగా మీగడ గోపి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మి నరసయ్య, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నరకుళ్ళ వెంకటేశ్వరరావు, పాలేరు ఇంచార్జి నున్నా రవికుమార్, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, కోటి హనుమంతరావు, జిల్లా, మండల నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని గోపి పేర్కొన్నారు.



