అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ పరిధిలోని ఓనుకొండ గ్రామ గిరిజనులు నిత్యావసరాలు, వైద్య అత్యవసరాల కోసం ప్రమాదకర పరిస్థితుల్లో శారదా నదిని దాటాల్సి వస్తోంది.నది ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అవతలి వైపుకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల చిన్నారులను సైతం భుజాలపై ఎత్తుకుని నదిని దాటుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యవసర సమయంలో వైద్యం కోసం వెళ్లాలన్నా, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా ఇదే మార్గంపై ఆధారపడాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు.ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో అధికారులు స్పందించి ఓనుకొండ గ్రామానికి సరైన రహదారి, శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి రాకపోకలకు సురక్షిత మార్గం కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Uploaded Video:

