ఖమ్మం, మే 21 :
జీవితాన్ని రోడ్డుపైనే గడిపిన ఓ లారీ డ్రైవర్… ప్రమాదం కారణంగా రెండు కాళ్లు కోల్పోయి వికలాంగుడిగా మారాడు. అయినా జీవన పోరాటాన్ని ఆపకుండా ప్రభుత్వం అందించిన వికలాంగుల సైకిల్‌పై జీవితం నెట్టుకొస్తున్న ఖానాపూరంకు చెందిన రామయ్యకు బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు ఆచంటి కోటేశ్వరరావు అండగా నిలిచారు.
గురువారం స్థానిక గట్టయ్య సెంటర్ వద్ద వికలాంగుల సైకిల్‌పై వెళ్తున్న రామయ్యను గమనించిన ఆచంటి కోటేశ్వరరావు, అతని పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో రామయ్యకు రూ.2,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా స్థానికులు ఆచంటి కోటేశ్వరరావు సేవా భావాన్ని అభినందించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రామయ్యకు అందించిన ఈ సహాయం అతనికి కొంత ఊరటనిచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.



