ఆసిఫాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగం ప్రాధాన్యతను, సమాజంలో ఫోటోగ్రాఫర్స్ అందిస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ sk సమీర్ పాల్గొని కేక్ కట్ చేసి ఫోటోగ్రాఫర్స్‌కు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా, చరిత్రలోని ముఖ్యమైన సంఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే గొప్ప కళ అని ఆయన పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అందరూ ఐక్యంగా ఉంటూ తమ రంగం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటోగ్రాఫర్స్, ఆఫీస్ బాయ్ చిన్న, ఉప్పరి నరేష్, సంజు, మరియు రాజశేఖర్, శ్రావణ్, కృష్ణ, వివేక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి కేక్ కట్ చేసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.


