శ్రీకాకుళం @ పున్నమి మే 17
తెలుగు భాష కోసం ఎన్ని మహాసభలైనా పెట్టి తెలుగు భాషను బతికించండి అంటూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీశ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ నిర్వహించే 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పోస్టర్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం గ్లోబల్ యూనివర్సిటీలో జూన్ 6, 7 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ఇటువంటి మహాసభలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. దేశ విదేశాల నుండి కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను మహోత్సవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక సాహిత్య సేవలను ప్రశంసిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వేదికపై మరింతగా చాటిచెప్పే ఈ మహాసభలను ప్రతి తెలుగువారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు డబ్బీరు గోవిందరావు., అధ్యక్షులు మని పాత్రుని నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ముట్నూరు ఉపేంద్రశర్మ, కార్యదర్శి చాడ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఇద్ది పాపయ్య, కార్యదర్శి ఐఎన్డీ ప్రసాద్, వాడాడ శ్రీనివాసరావు, ఫెరాపు దుర్గాప్రసాద్ శర్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు, గాయకురాలు పల్లె తేజలక్ష్మి, నృత్యదర్శకరాలు నీరజ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను విజయవంతం చేయాలి – కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం @ పున్నమి మే 17 తెలుగు భాష కోసం ఎన్ని మహాసభలైనా పెట్టి తెలుగు భాషను బతికించండి అంటూ కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీశ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ నిర్వహించే 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పోస్టర్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం గ్లోబల్ యూనివర్సిటీలో జూన్ 6, 7 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి విశ్వవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ఇటువంటి మహాసభలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. దేశ విదేశాల నుండి కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను మహోత్సవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక సాహిత్య సేవలను ప్రశంసిస్తూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ వేదికపై మరింతగా చాటిచెప్పే ఈ మహాసభలను ప్రతి తెలుగువారు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు డబ్బీరు గోవిందరావు., అధ్యక్షులు మని పాత్రుని నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ముట్నూరు ఉపేంద్రశర్మ, కార్యదర్శి చాడ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఇద్ది పాపయ్య, కార్యదర్శి ఐఎన్డీ ప్రసాద్, వాడాడ శ్రీనివాసరావు, ఫెరాపు దుర్గాప్రసాద్ శర్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు, గాయకురాలు పల్లె తేజలక్ష్మి, నృత్యదర్శకరాలు నీరజ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

