*బుచ్చినాయుడుకండ్రిగ, ఆగస్టు 29
గ్రామాల అభివృద్ధికి ప్రజాశి కాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఏపీఎం మునేయ్య అన్నారు. శనివారం మండలంలోని వెలుగు కార్యాలయంలో గ్రామ సమాఖ్య లీడర్లకు వి.పి.ఆర్.పి పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమాఖ్యల్లో సభ్యురాలివారిగా వారికి అవసరమైన కనీస హక్కులు, జీవనోపాధి అంశాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, సేవలు, వనరులను ప్రజలకు అందించడంతో పాటు సామాజిక అభివృద్ధికి అవసరమైన అంశాలను కూడా ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు.
పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామ సమాఖ్యల ప్రణాళికలను సమగ్రంగా ఏకీకృతం చేసి అక్టోబర్ లోని ర్యాంకింగ్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభలో సమర్పించి ఆమోదం పొందాలన్నారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రణాళికలను అమలు చేయడం ద్వారా గ్రామాల సర్వత్ర అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో సీసీలు పద్మిని, వెంకటరత్నం, జీవ, ట్రైనర్లు విష్ణుప్రియ, రేణుక, అకౌంటెంటు హేమగిరిజ, శిరీష గ్రామ సమాఖ్య లీడర్లు పాల్గొన్నారు.


