ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 20 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 20: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పొన్నూరు అమ్మతల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించి ఆలయంలోకి తీసుకెళ్లారు. కాకాణి రాకతో గ్రామస్తులు, స్థానిక నాయకులు భారీగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సహా రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించిన ఆయన, తనను ఆహ్వానించిన గ్రామ ప్రజలకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పొన్నూరు అమ్మతల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి కాకాణి ప్రత్యేక పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 20 (పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 20: ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పొన్నూరు అమ్మతల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించి ఆలయంలోకి తీసుకెళ్లారు. కాకాణి రాకతో గ్రామస్తులు, స్థానిక నాయకులు భారీగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సహా రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించిన ఆయన, తనను ఆహ్వానించిన గ్రామ ప్రజలకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

