విజయవాడ–జగ్దల్పూర్ జాతీయ రహదారిపై తెలంగాణ ప్రారంభ మండలమైన పెనుబల్లి మండలం వంగా ముత్యాల బంజర్ రింగ్ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్ రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.



