Monday, 7 September 2026
  • Home  
  • పుల్లంపేటలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా…
- తిరుపతి

పుల్లంపేటలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా…

పుల్లంపేటలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా పుల్లంపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్‌ఐ వి. చిన్న రెడ్డెప్ప ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. అనంతసముద్రం, వడ్డుపల్లి, అగ్రహారం గ్రామాలతో పాటు శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను డ్రోన్ల ద్వారా పరిశీలించారు. పేకాట స్థావరాలు, కోళ్ల పందేలు, గంజాయి నిల్వలు, వినియోగం, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ నిఘాకు అందని ప్రాంతాల్లోనూ డ్రోన్ల సహాయంతో అనుమానాస్పద కదలికలను గుర్తించి, అవసరమైనప్పుడు వెంటనే పోలీసు సిబ్బంది స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కదలికలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సమాచారాన్ని అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవసరాన్ని బట్టి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ డ్రోన్ నిఘాను విస్తరిస్తామని కోడూరు రూరల్ సీఐ పేర్కొన్నారు.

పుల్లంపేటలో డ్రోన్ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా

పుల్లంపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, పుల్లంపేట ఎస్‌ఐ వి. చిన్న రెడ్డెప్ప ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. అనంతసముద్రం, వడ్డుపల్లి, అగ్రహారం గ్రామాలతో పాటు శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలను డ్రోన్ల ద్వారా పరిశీలించారు. పేకాట స్థావరాలు, కోళ్ల పందేలు, గంజాయి నిల్వలు, వినియోగం, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ నిఘాకు అందని ప్రాంతాల్లోనూ డ్రోన్ల సహాయంతో అనుమానాస్పద కదలికలను గుర్తించి, అవసరమైనప్పుడు వెంటనే పోలీసు సిబ్బంది స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద కదలికలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సమాచారాన్ని అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవసరాన్ని బట్టి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ డ్రోన్ నిఘాను విస్తరిస్తామని కోడూరు రూరల్ సీఐ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.