Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నర్సంపేటలో అడుగులన్నీ బీజేపీ వైపే – డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నర్సంపేటలో అడుగులన్నీ బీజేపీ వైపే – డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు దుగ్గొండి మండల బీజేపీ కార్యాలయంలో, మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన చేరికల కార్యక్రమంలో మహ్మదాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్ పాలడుగుల శివ, బోడుగే అనిల్, మురహరి సురేష్ చంద్రాయపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు…
  • గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన నాయకులకు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా డా.
  • రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..

ఈరోజు దుగ్గొండి మండల బీజేపీ కార్యాలయంలో, మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ అధ్యక్షతన జరిగిన చేరికల కార్యక్రమంలో
మహ్మదాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ వార్డు మెంబర్ పాలడుగుల శివ,
బోడుగే అనిల్, మురహరి సురేష్
చంద్రాయపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు – కామిడి సాంబరెడ్డి- దుగ్గొండి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు – పాండవుల కొమ్మాలు భారతీయ జనతా పార్టీలో చేరారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన నాయకులకు కాషాయ కండువా కప్పి, పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందని, ఆ పార్టీల సీనియర్ నాయకుల అడుగులన్నీ ఇప్పుడు బీజేపీ వైపే పడుతున్నాయని అన్నారు.
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి అవినీతి రహిత పాలన, అభివృద్ధి, జాతీయవాదాన్ని చూసి యువత, ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన 10 ఏళ్ల అరాచక, కుటుంబ పాలన, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. నర్సంపేటలో మనం చేస్తున్న నిరంతర ప్రజా పోరాటాలకు మరియు ప్రజా సేవ కార్యక్రమాలకు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తోంది. రాబోయే రోజుల్లో నర్సంపేటలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, పదవులు ఇచ్చి కాపాడుకుంటాం అని అన్నారు
ఈ కార్యక్రమంలో st మోర్చా జిల్లా అధ్యక్షులు బానోతు రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగుల జీవన్ గారు, జిల్లా కౌన్సిల్ మెంబెర్ చెల్పూరి రాజు,నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్,మండల ప్రధాన కార్యదర్శులుకొండపాక మధు,కతారాబాజీ చిరంజీవి మండల ఉపాధ్యక్షులు యాదగిరి నవీన్, సకినాల నరేష్, మాదం భాస్కర్, సీనియర్ నాయకులు మొకిడే ప్రభాకర్ కార్యదర్శులు కడివేండి లింగచారి, కొత్తూరు ప్రభాకర్,దూలం రామకృష్ణ బూత్ అధ్యక్షులు, ముప్పారపు జగదీశ్, బుట్టి రాజు, బుసారి నరేష్, లడే విశ్వనాధ్, బత్తుల నాగరాజు, ఈర్ల రాజు, చాపర్తి రాజు, గొర్రె దూడాలు, మణికంఠ,బట్టు రాజేందర్,పొగాకు దేవేందర్,కోట కార్తీక్ వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *