రాష్ట్రంలోనే ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రము గా పేరుగాంచిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి దేవస్థానం ఉన్న బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని,కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు బ్రహ్మంగారిమఠం మండల ప్రజలు, స్వామివారి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రస్తుతం బ్రహ్మంగారిమఠంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఉందని,ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రస్తుతం పేషంట్లకు సరిపడ వసతులు లేవని ప్రజలు వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తదైనప్పటికీ పడకలు లేకపోవడంతో సెలైన్ పెట్టించుకునే రోగులు క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని,బి.మఠం మండలంలో అధిక జనాభా ఉండడం వల్ల, ఉన్న ఆసుపత్రి సరిపోవటం లేదని,దీనిని అప్ గ్రేడ్ చేసినట్లయితే మరిన్ని వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మండల ప్రజలు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ ను కోరుకుంటున్నారు. అంతేకాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించేందుకై ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుందని.దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చినట్లయితే రోగులకు మరింత సులభతరంగా వైద్య సేవలు అందుతాయన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా మార్చినట్లయితే 24 గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు వీలుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.రోగుల సౌలభ్యం కోసం ఎమ్మెల్యే దృష్టి పెట్టి ఈ వైద్య కేంద్రాన్ని సిహెచ్సి సెంటర్ గా మార్చినట్లయితే ఇటు స్థానికులకే కాకుండా అటు పుణ్యక్షేత్రాన్ని దర్శించేందుకు వచ్చు యాత్రికులకు కూడా ఎంతో సౌకర్యంగా అందుబాటులో ఉంటుందని ప్రజలు గుర్తు చేశారు. ఇప్పటికే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికంగా పేషెంట్లు రావడం జరుగుతుంది.ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ సిహెచ్సి సెంటర్ ఎందుకు పెట్టాలనో,దాని ప్రాముఖ్యత గురించి ఎమ్మెల్యే కు వివరించి,ఎమ్మెల్యే ద్వారా ఈ ప్రయత్నం చేయాలని బ్రహ్మంగారి మఠం మండల తెలుగు దేశం పార్టీ నాయకులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో ఉంచుకొని పీహెచ్ సి ని, సిహెచ్ సి గా మార్చాలి ఎమ్మెల్యే పుట్టా కు విజ్ఞప్తి చేసిన మండల ప్రజలు, భక్తులు