పాలేరు /ఖమ్మం
పాలేరు జలాశయాన్ని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నందున నీరు కలుషితం కాకుండా వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని ఇరిగేషన్ డీఈఈ చిట్టిబాబు తెలిపారు. జలాశయంలో విగ్రహాల నిమజ్జనం వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించి జలాశయ నీటి స్వచ్ఛతను కాపాడేందుకు సహకరించాలని చిట్టిబాబు కోరారు.




