వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో (పాకాల) సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన పాము స్థానికుల కంటపడింది. గ్రామంలో ఉండే యువకులు పామును ఎలాంటి హాన్ని కలగకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. అనంతరం పాకాల అడవి శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అటవీ అధికారులు సురక్షితంగా పామును అడవిలోకి వదిలారు.



