-నెల్లూరు నగరంలోని దేవిరెడ్డి సుజాతమ్మ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు.
దాతల సహకారంతో పి ఫోర్ కార్యక్రమం ద్వారా నెల్లూరు నగరంలోని ఉన్నత పాఠశాలల రూపురేఖలు స్థితిగతులు పూర్తిగా మారిపోతున్నాయని చెప్పారు ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ఇవాళ నెల్లూరు నగరంలోని దేవిరెడ్డి సుజాతమ్మ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నూతన భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. దేవి రెడ్డి సుజాతమ్మ పేరుతో నగరపాలక ఉన్నత పాఠశాలలో ఆమె సుధాకర్ రెడ్డి భర్త కుటుంబ సభ్యులు 20కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నూతన భవనాలను నిర్మించి పాఠశాలను పూర్తిస్థాయిలో ఆధునికరించారని తెలిపారు. త్వరలోనే ఈ భవనం విద్యార్థులకు అందుబాటు కాబోతుందని నారాయణ అన్నారు. డిఆర్ఎస్ పాఠశాల నూతన భవనం ఆధునీకరణ పనులు చివరి అంకానికి చేరినట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమౌతున్న పాఠశాల ఈ ఉన్నత పాఠశాల భావితరాలకు విద్యా కేంద్రంగా బాసిల్లుతుందని చెప్పారు. అత్యాధునిక నాణ్యత ప్రమాణాలతో పాఠశాలను ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మంత్రి నారాయణ అభినందించారు…ఈ సందర్బంగా పాఠశాల నిర్వహణ,అడ్మిషన్ లపై డిఈఓ బాలాజీరావు, ఉపాధ్యాయులతో మంత్రి సమీక్షించారు.


