నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు.. భక్తుల ఆగ్రహం!
నెల్లూరు: కొండాపురం మండలంలోని ఓ గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జన ఊరేగింపులో కొందరు అత్యుత్సాహంతో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా నిర్వహించాల్సిన వినాయక చవితి వేడుకల్లో ఇలాంటి అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. కుటుంబాలతో కలిసి వేడుకలను వీక్షించే సమయంలో ఇలాంటి నృత్యాలు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిమజ్జన కార్యక్రమాల్లో అసభ్యకర ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు.. భక్తుల ఆగ్రహం!
నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు.. భక్తుల ఆగ్రహం! నెల్లూరు: కొండాపురం మండలంలోని ఓ గ్రామంలో బుధవారం సాయంత్రం వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జన ఊరేగింపులో కొందరు అత్యుత్సాహంతో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రంగా నిర్వహించాల్సిన వినాయక చవితి వేడుకల్లో ఇలాంటి అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించడం సరికాదని పలువురు మండిపడుతున్నారు. కుటుంబాలతో కలిసి వేడుకలను వీక్షించే సమయంలో ఇలాంటి నృత్యాలు నిర్వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిమజ్జన కార్యక్రమాల్లో అసభ్యకర ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

