Monday, 28 September 2026
  • Home  
  • నిందితులకు కఠిన శిక్షే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి
- తూర్పు గోదావరి

నిందితులకు కఠిన శిక్షే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే నల్లమిల్లి

రాజమహేంద్రవరం, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసు దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతోందని, నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. విచారణలో కొన్ని అంశాలను గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని, ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు. వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించడంతో పాటు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. జీఎస్‌ఎల్ యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడాన్ని అభినందించారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి పిలుపునిచ్చారు.

రాజమహేంద్రవరం, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజమహేంద్రవరంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేసు దర్యాప్తు చట్ట ప్రకారం కొనసాగుతోందని, నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. విచారణలో కొన్ని అంశాలను గోప్యంగా ఉంచాల్సి ఉంటుందని, ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు. వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించడంతో పాటు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. జీఎస్‌ఎల్ యాజమాన్యం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందించడాన్ని అభినందించారు. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతామని తెలిపారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి నిందితులకు కఠిన శిక్ష పడేలా కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.