పూన్నవి ప్రతినిధి నాగర్కర్నూల్ ఆగస్టు 21
వరాల తల్లి మమ్మల్ని దీవించమ్మా..
49 మహిళా కుటుంబాలచే వరలక్ష్మి వ్రతాలు
వరలక్ష్మి మాతను పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి-సాయి సంస్థ కన్వీనర్ బాలరాజు
భక్తి శ్రద్ధలతో పాల్గొన్న మహిళలు,భక్తులు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని భగవాన్ శ్రీ సత్యసాయి మందిరంలో శ్రావణమాస మూడవ శుక్రవారం వేద మంత్రోచ్ఛారణల మధ్య సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో మహిళలు నిర్వహించినట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ తెలిపారు.
సత్యసాయి మందిర ఆలయ అర్చకుడు రాజశేఖర్ శర్మ వరలక్ష్మీ వ్రతాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఆయన వ్రత విశిష్టతను వివరిస్తూ..పరమ శివుడిని పార్వతి దేవి వరంగా కోరిన వ్రతమే వరలక్ష్మీ వ్రతం అని ఆయన అన్నారు.శ్రీసూక్తం ప్రధానంగా చారుమతి బ్రాహ్మణ మహిళ మొదట ఆచరణతోపూజించి,భారతీయులకు అందించిన వరమని తెలిపారు.అమ్మవారిని వివిధ విశేష పూజాద్రవ్యాలు,ప్రత్యేక మంత్రములతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు వారి కుటుంబం సౌభాగ్యం,ఆరోగ్యంగా ఉంటుందని ధన,ధాన్య,ధైర్య,సిద్ధి , శౌర్య,విద్య ,సంతానం,వరాలు,ఐశ్వర్యాలు పొందుటకు అత్యంత సులభమైన మార్గం వరలక్ష్మీ వ్రతం అని శ్రావణ మాసంలో మహా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం,శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారిని వరలక్ష్మీ రూపంలో పూజించడం విశిష్ట పుణ్య ఫలితం అందుతుందని వివరించారు.అమ్మవారిని కొలచడం,కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలు ప్రాప్తిస్తుందని తెలిపారు.అనంతరం ఆలయంలో భజనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.మహిళలు ఒకరికి ఒకరు సాంప్రదాయంగా,వాయనాలు, పసుపు, కుంకుమలు, అందజేసుకున్నారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ సామూహిక భోజనాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్ కొండూరు బాలరాజు,మహిళా కన్వీనర్ ఏం.సువర్ణ,సాయి గీత,సుప్రజా,కళ్యాణి, బలమని, అర్చన, నాగలక్మి శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ ట్రస్ట్ కన్వీనర్ హకీం విశ్వ ప్రసాద్,కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, సాయి భక్తులు ఇందిరమ్మ,శోభా, అరుణ,శారద లలిత,పావని, సరిత,శ్రీను, భాస్కర్ ,పాండురంగా రెడ్డి ,సతీష్,లక్మిపతి,మన్నెపు రెడ్డి,ప్రసాద,రాజు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Uploaded Video:


