నందిగామ, సెప్టెంబర్ 25, 2025: (పున్నమి ప్రతినిధి)స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ‘స్వచ్ఛ ఉత్సవ్’ కార్యక్రమాన్ని గురువారం నాడు నందిగామ పట్టణంలోని మధిర ఆర్చి రోడ్‌పై నున్న చిన్న బ్రిడ్జి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొని, మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతలపై సందేశం ఇచ్చారు.
స్వచ్ఛ ఉత్సవ్ ప్రజల్లో అవగాహన కల్పించడం లక్ష్యంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మతి మండవ కృష్ణకుమారి,కూటమి నేతలు, స్థానిక ప్రజలు,మున్సిపల్ అధికారులు,యువత హాజరై, బ్రిడ్జి పరిసరాల్లో శుభ్రతా కార్యకలాపాలు చేపట్టారు. ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య స్వచ్ఛతలో భాగంగా మొక్కను నాటారు.
మతి తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, “స్వచ్ఛత మన జీవితంలో అంతర్భాగం కావాలి మనమంతా కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందాం.మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ సమృద్ధి పెంచి, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిద్దాం” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా జరిగిందని, ఇలాంటి ఉద్యమాలు ప్రతి గ్రామం, పట్టణంలో నిర్వహించాలని ఆమె సూచించారు.


