వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో దేవాలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


