Monday, 3 August 2026
  • Home  
  • ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు సంబరాలు
- ఖమ్మం

ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు సంబరాలు

ఖమ్మం ఆగష్టు (పున్నమి న్యూస్ ) ఈరోజు ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మందా సరస్వతి గారి ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు సాంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే గోరింటాకు ప్రతి శుభకార్యంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. వివాహిత మహిళలు గోరింటాకు ధరిస్తే భర్తకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలుగుతాయని, అవివాహిత యువతులు గోరింటాకు పెట్టుకుంటే మంచి వరుడు లభిస్తాడనే విశ్వాసం మన భారతీయ సంప్రదాయంలో ఉంది. ఈ విలువలను చాటి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నెల్లూరి శోభారాణి గారు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి పమ్మి అనిత గారు, మాజీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి విజయ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి శ్రీమతి దొడ్డ అరుణ గారు, శ్రీమతి శ్రీరాంనేని మణి గారు, శ్రీమతి రజిని రెడ్డి గారు, శ్రీమతి నీలిమ గారు, శ్రీమతి నాగమణి గారు, శ్రీమతి స్వర్ణ గారు, శ్రీమతి అంజలి గారు, రాష్ట్ర, జిల్లా, మండల మహిళా మోర్చా నాయకురాళ్లు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )

ఈరోజు ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి మందా సరస్వతి గారి ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు సాంప్రదాయబద్ధంగా, ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే గోరింటాకు ప్రతి శుభకార్యంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. వివాహిత మహిళలు గోరింటాకు ధరిస్తే భర్తకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలుగుతాయని, అవివాహిత యువతులు గోరింటాకు పెట్టుకుంటే మంచి వరుడు లభిస్తాడనే విశ్వాసం మన భారతీయ సంప్రదాయంలో ఉంది. ఈ విలువలను చాటి చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నెల్లూరి శోభారాణి గారు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి పమ్మి అనిత గారు, మాజీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి విజయ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి శ్రీమతి దొడ్డ అరుణ గారు, శ్రీమతి శ్రీరాంనేని మణి గారు, శ్రీమతి రజిని రెడ్డి గారు, శ్రీమతి నీలిమ గారు, శ్రీమతి నాగమణి గారు, శ్రీమతి స్వర్ణ గారు, శ్రీమతి అంజలి గారు, రాష్ట్ర, జిల్లా, మండల మహిళా మోర్చా నాయకురాళ్లు మరియు పలువురు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.