హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) కారణంగా ఆయన ఆరోగ్యం విషమించగా, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మృతితో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.



