Tuesday, 1 September 2026
  • Home  
  • నక్కల కాలువ వంతెన మరమ్మతులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్
- తిరుపతి

నక్కల కాలువ వంతెన మరమ్మతులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్

శ్రీ కాళహస్తి, జూన్ 03, (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలోని 29వ వార్డు పరిధిలో గల నక్కల కాలువ వంతెన ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో, దానికి వెనువెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గత ఏడాది నిర్మించిన మురుగు కాలువ కారణంగా, క్రితం వర్షాకాలంలో నక్కల కాలువ వంతెన వద్ద మట్టి కోతకు గురైంది. దీనివల్ల నవంబర్ నెలలో వంతెనకు ఉన్న రిటర్నింగ్ వాల్ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, ప్రస్తుతం వంతెన కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది. ఈ ప్రమాదకర పరిస్థితిపై గత కొన్ని నెలలుగా పలు ప్రభుత్వ శాఖలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాళహస్తి పురపాలక శాఖ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి త్వరితగతిన నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మార్గం గుండా నిత్యం వేలాది మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారని, కావున భక్తులు, స్థానికుల భద్రతను దృష్ట్యా వంతెనకు శాశ్వత మరమ్మత్తులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షుడు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షుడు ఆంటోనీ, ఏర్పేడు మండల నాయకులు మురళి రెడ్డి, జోసెఫ్, కృష్ణ సాయి, నాగరాజు, మహేష్, మాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.