Saturday, 12 September 2026
  • Home  
  • నంద్యాల కలెక్టర్‌ రాజకుమారికి సీఎం చంద్రబాబు ప్రశంసలు
- నంద్యాల

నంద్యాల కలెక్టర్‌ రాజకుమారికి సీఎం చంద్రబాబు ప్రశంసలు

నంద్యాల: ప్రజా ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్న నంద్యాల జిల్లా యంత్రాంగం పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. అమరావతిలో జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా నంద్యాలలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.గ్రీవెన్స్‌ ఫిర్యాదుల ఆధారంగా జంబులదిన్నె గ్రామంలో కల్వర్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు జిల్లాలో మరో 14 కల్వర్టులు, వంతెనల పనులు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఉచిత భోజనం, ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ ప్లేట్ల వినియోగం వంటి సౌకర్యాలపై సీఎం హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.