Monday, 7 September 2026
  • Home  
  • నందలూరు క్రీడా మైదానానికి విముక్తి: జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు చొరవతో స్మార్ట్ కిచెన్ స్థల మార్పిడి
- అన్నమయ్య

నందలూరు క్రీడా మైదానానికి విముక్తి: జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు చొరవతో స్మార్ట్ కిచెన్ స్థల మార్పిడి

నందలూరు క్రీడా మైదానానికి విముక్తి: జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు చొరవతో స్మార్ట్ కిచెన్ స్థల మార్పిడి! నందలూరు సెప్టెంబర్ 06, నందలూరు జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణాన్ని నిలిపివేస్తూ, వేరే ప్రాంతానికి తరలించేలా జిల్లా కలెక్టర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆక్రమణలతో కుదించుకుపోయిన క్రీడా మైదానంలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తే ఆటల ప్రాంగణం మరుగున పడిపోతుందని, విద్యార్థుల బోధనకు, రవాణా మరియు పరిశుభ్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని గత నెల రోజులుగా సిటిజన్స్ అసోసియేషన్ పోరాటం చేస్తోంది. ఈ విషయమై ఎంఈఓ, ఎంపీడీఓ, సబ్ కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ అభ్యంతరానికి వాకర్స్ అసోసియేషన్, స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ యూత్ అసోసియేషన్, CAYD క్రీడాకారులు, నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. శ్రీనివాసరాజు చొరవ – కలెక్టర్ స్పందన: ఈ విషయాన్ని ప్రజాసంఘాలు రాజంపేట పార్లమెంట్ జనసేన ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కడప జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మైదానంలో కిచెన్ ఏర్పాటు చేయడం వల్ల తలెత్తే రవాణా, పారిశుధ్య, పాఠ్యాంశ బోధన ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, స్మార్ట్ కిచెన్‌ను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాసరాజుకు ఘన సత్కారం: సమస్య పరిష్కారానికి కృషి చేసిన యల్లటూరు శ్రీనివాసరాజును రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ కార్యాలయంలో సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు. నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు, క్రీడాకారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరుముగం విశ్వనాథ్,ఉపాధ్యక్షులు మల్లెల విజయుడు,సి.ఏ.వై.డి కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, కార్యదర్శులు పఠాన్ మెహర్ ఖాన్, సయ్యద్ జుల్ఫికర్ క్రీడా కార్యదర్శి మధు,తదితరులు పాల్గొన్నారు.

నందలూరు క్రీడా మైదానానికి విముక్తి: జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు చొరవతో స్మార్ట్ కిచెన్ స్థల మార్పిడి!

నందలూరు సెప్టెంబర్ 06,
నందలూరు జిల్లా పరిషత్ క్రీడా మైదానంలో స్మార్ట్ కిచెన్ నిర్మాణాన్ని నిలిపివేస్తూ, వేరే ప్రాంతానికి తరలించేలా జిల్లా కలెక్టర్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే ఆక్రమణలతో కుదించుకుపోయిన క్రీడా మైదానంలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేస్తే ఆటల ప్రాంగణం మరుగున పడిపోతుందని, విద్యార్థుల బోధనకు, రవాణా మరియు పరిశుభ్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని గత నెల రోజులుగా సిటిజన్స్ అసోసియేషన్ పోరాటం చేస్తోంది. ఈ విషయమై ఎంఈఓ, ఎంపీడీఓ, సబ్ కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ అభ్యంతరానికి వాకర్స్ అసోసియేషన్, స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ యూత్ అసోసియేషన్, CAYD క్రీడాకారులు, నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు.
శ్రీనివాసరాజు చొరవ – కలెక్టర్ స్పందన:
ఈ విషయాన్ని ప్రజాసంఘాలు రాజంపేట పార్లమెంట్ జనసేన ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి కడప జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మైదానంలో కిచెన్ ఏర్పాటు చేయడం వల్ల తలెత్తే రవాణా, పారిశుధ్య, పాఠ్యాంశ బోధన ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, స్మార్ట్ కిచెన్‌ను వేరే ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
శ్రీనివాసరాజుకు ఘన సత్కారం:
సమస్య పరిష్కారానికి కృషి చేసిన యల్లటూరు శ్రీనివాసరాజును రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ కార్యాలయంలో సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో ఘనంగా సత్కరించారు. నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు, క్రీడాకారులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరుముగం విశ్వనాథ్,ఉపాధ్యక్షులు మల్లెల విజయుడు,సి.ఏ.వై.డి కోచ్
ఫిరోజ్ ఖాన్ లోడి, ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, కార్యదర్శులు పఠాన్ మెహర్ ఖాన్, సయ్యద్ జుల్ఫికర్ క్రీడా కార్యదర్శి మధు,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.