ఉదయగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉదయగిరిలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.
తొలుత ఉదయగిరి బస్టాండ్ నుంచి 300కు పైగా బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన జెండాలు, నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ఉదయగిరి సెంటర్‌లో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తల డాన్సులతో ఉదయగిరి సెంటర్ సందడిగా మారింది.
అనంతరం పంచాయతీ కార్మికులకు చీరలు, బహుమతులు అందజేసి వారి సేవలను అభినందించారు. అనంతరం షాదీ మంజిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రసంగాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా లైవ్‌లో వీక్షించారు.
ఈ సందర్భంగా “జై కొట్టు” లోగోను విడుదల చేసి, పాటను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఉదయగిరి మొత్తం జనసేన జెండాలతో కళకళలాడగా, భారీ బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, బాణాసంచా, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది.

దద్దరిల్లిన ఉదయగిరి.. అంబరాన్ని అంటిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ఉదయగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉదయగిరిలో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తొలుత ఉదయగిరి బస్టాండ్ నుంచి 300కు పైగా బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన జెండాలు, నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ఉదయగిరి సెంటర్‌లో భారీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బాణాసంచా కాల్చడంతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తల డాన్సులతో ఉదయగిరి సెంటర్ సందడిగా మారింది. అనంతరం పంచాయతీ కార్మికులకు చీరలు, బహుమతులు అందజేసి వారి సేవలను అభినందించారు. అనంతరం షాదీ మంజిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రసంగాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా లైవ్‌లో వీక్షించారు. ఈ సందర్భంగా “జై కొట్టు” లోగోను విడుదల చేసి, పాటను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ఉదయగిరి మొత్తం జనసేన జెండాలతో కళకళలాడగా, భారీ బైక్ ర్యాలీ, కేక్ కటింగ్, బాణాసంచా, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది.

