Thursday, 24 September 2026
  • Home  
  • దంసలపురం చెరువులో కట్టుదిట్టమైన భద్రత.. 150 మంది గజ ఈతగాళ్లతో నిఘా
- ఖమ్మం

దంసలపురం చెరువులో కట్టుదిట్టమైన భద్రత.. 150 మంది గజ ఈతగాళ్లతో నిఘా

ఖమ్మం: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని దంసలపురం చెరువు వద్ద అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా జరిగేలా 18 క్రేన్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు 150 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. చెరువులో నీటిమట్టం సాధారణ స్థాయిలోనే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా గజ ఈతగాళ్లకు తప్ప ఇతరులను చెరువులోకి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నిమజ్జన ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ కోసం 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో భక్తులకు స్పష్టమైన వెలుతురు ఉండేలా హైమాస్ట్ లైట్లతో పాటు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. భక్తులు, వినాయక మండపాల నిర్వాహకులు అధికారుల సూచనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.