నంద్యాల: నంద్యాల నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ అతి త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నా పార్టీ, నా జెండా, నా అజెండా… నంద్యాల ప్రజల సంక్షేమం, యువత ఉపాధి, విద్య, వైద్యం మరియు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు తన సొంత నిధులతో రూ. 1 కే నిత్య అన్నదానం, జర్నలిస్టులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, దేవాలయాలు, మసీదులు, చర్చీల నిర్మాణాలకు విరాళాలు మరియు వైకుంఠ రథం కొరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా త్వరలోనే పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

త్వరలో సొంత పార్టీని ప్రకటించనున్న వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్
నంద్యాల: నంద్యాల నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ అతి త్వరలోనే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. నా పార్టీ, నా జెండా, నా అజెండా… నంద్యాల ప్రజల సంక్షేమం, యువత ఉపాధి, విద్య, వైద్యం మరియు నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు తన సొంత నిధులతో రూ. 1 కే నిత్య అన్నదానం, జర్నలిస్టులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం, దేవాలయాలు, మసీదులు, చర్చీల నిర్మాణాలకు విరాళాలు మరియు వైకుంఠ రథం కొరకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా త్వరలోనే పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

