తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (TPTF) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లో ఫిజిక్స్ వాలా కాలేజీ ,కొత్తపేట్ లో రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి వివిద జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్స్ కు సంబంధించిన వివిధ రకాల అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా TPTF రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ గారూ మాట్లాడుతూ, టీచర్స్ సంక్షేమ హక్కుల సాధన నే తమ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు బయ్య శివరాజ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్,
వరంగల్ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి సునీల్ కుమార్, జనగాం జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సూర్యాపేట్ జిల్లా అధ్యక్షులు వీరబోయిన వెంకట్,
హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అలీబాయ్,అచ్చంపేట నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.


