సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసంలో తిరుపతి పార్లమెంటు పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు మరియు ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ పాలన, నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు టీడీపీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ జరిగిన ఈ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గం పరిస్థితులపై కూడా జిల్లా నాయకులతో చర్చించిన టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి.
అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది తన నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో శాఫ్ చైర్మన్ రవి నాయుడు, తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తిరుపతి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ,ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ,పాశం సునీల్ కుమార్,తిరుపతి ఇంచార్జి జేబీ శ్రీనివాస్ లతో కలిసి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.


