Sunday, 6 September 2026
  • Home  
  • అనంతపురమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
- తిరుపతి

అనంతపురమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

చిట్వేల్: మండలంలోని తిమ్మయ్యగారిపల్లెలో శ్రీ అనంతపురమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. అనంతపురమ్మ తల్లి కృపతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ముక్కా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిట్వేల్: మండలంలోని తిమ్మయ్యగారిపల్లెలో శ్రీ అనంతపురమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూతన ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. అనంతపురమ్మ తల్లి కృపతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ముక్కా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, భక్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.