Monday, 7 September 2026
  • Home  
  • ఆటో కార్మికుల హామీలు అమలు చేయాలి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన ర్యాలీ
- ఖమ్మం

ఆటో కార్మికుల హామీలు అమలు చేయాలి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన ర్యాలీ

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు సత్తార్ మియా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏటా ఆటో కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, ఇప్పటివరకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. హామీల అమలు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి ప్రసాద్, పాషా, మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.