*కట్ల సంతోష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు*
3 వేల మందికి అన్నదానం
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షలు
వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జన్మదిన వేడుకలు శనివారం వైరా పట్టణంలో అపూర్వ ఉత్సాహం మధ్య ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మంది కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రాందాస్ నాయక్‌కు కట్ల సంతోష్, చెరుకూరి కిరణ్ భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక రింగ్ రోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు జైజైధ్వానాలు చేస్తూ, టపాసులు పేలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ ఎమ్మెల్యేను ఊరేగింపుగా తీసుకెళ్లారు. జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్, మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బోర్రా రాజశేఖర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు , మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ తో కలిసి ప్రారంభించారు. సుమారు మూడు వేల మంది ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు. జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో ముడిపెట్టడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
ఈ సందర్భంగా కట్ల సంతోష్ మాట్లాడుతూ, వైరా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, సాగునీరు, సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి పనులను వేగవంతం చేశారని పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ, తనపై ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలు జీవితాంతం మరువలేనివని అన్నారు. తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సహకారంతో మరింత బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ రంగారావు, చెరుకూరి కిరణ్, పమ్మి అశోక్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, తాటిపూడి సర్పంచ్ జవ్వాజి అశ్విని, ఖానాపురం సర్పంచ్ బాలాజీ, కౌన్సిలర్లు మోరు శ్రీకాంత్, ధిరావత్ వెంకటేశ్వర్లు, గోరుంట్ల శ్రీదేవి, బత్తుల సుమతి, నాయకులు గుమ్మ రోశయ్య, రాయల రాము, జవాజి నాగరాజు, మచ్చ బుజ్జి, కట్ల నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు చలపతి, సురేందర్, పూర్ణయ్య, ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


