ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతి నిధి)
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ, డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి ఫుట్‌పాత్‌లు, రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, బోర్డులను తొలగించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని సీఐ సత్యనారాయణ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.



