Friday, 15 May 2026
  • Home  
  • నందిగామలో సాయిజయంతి వేడుకలు ఘనంగా – 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
- ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో సాయిజయంతి వేడుకలు ఘనంగా – 2 లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలోని గీతా మందిరం శ్రీ భగవాన్ సత్యసాయి మందిరంలో బుధవారం భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జయంతి ఉత్సవాలలో భాగంగా చిన్నారులు సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభలోని భక్తులను ఆకట్టు కున్నాయి. సత్యసాయి సందేశాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబిం చేలా పిల్లలు ప్రదర్శించిన నృత్యకళలను ఎమ్మెల్యే సౌమ్య మహిళా మణులతో కలిసి వీక్షించారు. తరువాత భగవాన్ శ్రీ సత్యసాయి సేవ కమిటీకి ఎమ్మెల్యే రూ. 2 లక్షల విరాళాన్ని స్వయంగా అందజేశారు. ఆమె చేసిన ఈ సహాయానికి సభలో హర్షధ్వా నాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య “భగవాన్ శ్రీ సత్యసాయి జీవితం ప్రేమ, శాంతి, సేవలకు ప్రతీక. సమాజ హితానికి ఆయన చేసిన సేవలు యుగయుగాల పాటు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి విలువలను ప్రజల్లో నాటడంలో సత్యసాయి చేసిన సేవలను స్మరించారు. జయంతి వేడుకల సందర్భంగా దేవాలయ ప్రాంగణం భక్తులు, మహిళా బృందాలు, సాంస్కృతిక కళాకారులతో కళకళలాడింది. భజనలు, మాతృపూజ, సేవా కార్యక్రమా లతో వేదిక ఆధ్యాత్మిక వాతావరణంలోనిండిపోయింది. మొత్తం గా, నందిగామలో నిర్వహించిన సత్యసాయి 100వ జయంతి వేడుకలు ఆధ్యాత్మికత, సేవా భావం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచాయి.

నందిగామ పట్టణంలోని గీతా మందిరం శ్రీ భగవాన్ సత్యసాయి మందిరంలో బుధవారం భగవాన్ శ్రీ సత్యసాయి 100వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
జయంతి ఉత్సవాలలో భాగంగా చిన్నారులు సమర్పించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభలోని భక్తులను ఆకట్టు కున్నాయి. సత్యసాయి సందేశాలు, సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబిం చేలా పిల్లలు ప్రదర్శించిన నృత్యకళలను ఎమ్మెల్యే సౌమ్య మహిళా మణులతో కలిసి వీక్షించారు. తరువాత భగవాన్ శ్రీ సత్యసాయి సేవ కమిటీకి ఎమ్మెల్యే రూ. 2 లక్షల విరాళాన్ని స్వయంగా అందజేశారు. ఆమె చేసిన ఈ సహాయానికి సభలో హర్షధ్వా నాలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
“భగవాన్ శ్రీ సత్యసాయి జీవితం ప్రేమ, శాంతి, సేవలకు ప్రతీక. సమాజ హితానికి ఆయన చేసిన సేవలు యుగయుగాల పాటు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి విలువలను ప్రజల్లో నాటడంలో సత్యసాయి చేసిన సేవలను స్మరించారు.
జయంతి వేడుకల సందర్భంగా దేవాలయ ప్రాంగణం భక్తులు, మహిళా బృందాలు, సాంస్కృతిక కళాకారులతో కళకళలాడింది. భజనలు, మాతృపూజ, సేవా కార్యక్రమా లతో వేదిక ఆధ్యాత్మిక వాతావరణంలోనిండిపోయింది.
మొత్తం గా, నందిగామలో నిర్వహించిన సత్యసాయి 100వ జయంతి వేడుకలు ఆధ్యాత్మికత, సేవా భావం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.