హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పార్టీ నిధికి ఐదు కోట్లు ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు దిశగా నడిపించడంలో కీలక భూమిక పోషించిన వేమిరెడ్డి దంపతులు, పార్టీ పట్ల తమకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు.. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
‘మహానాడు’ వేడుకల్లో భాగంగా ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గం సరికొత్త చరిత్ర సృష్టించింది. . మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమాన్ని వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో వీక్షించేందుకు కార్యకర్తలు 11 క్టస్లర్లలో జరిగిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు , కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మహానాడు పై దిశానిర్దేశం చేశారు..నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న11 క్లస్టర్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, డిజిటల్ వ్యవస్థల ద్వారా సుమారు 11 వేల మందికి పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఏకకాలంలో ఈ మహానాడులో పాల్గొన్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ప్రసంగాలను ఉత్సాహంగా వీక్షించారు. ఒకే నియోజకవర్గం నుంచి ఈ స్థాయిలో వర్చువల్ విధానంలో ఇంత పెద్ద సంఖ్యలో కేడర్ పాల్గొనడం రాష్ట్రస్థాయిలోనే సరికొత్త రికార్డుగా నిలిచిందని పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. “సరికొత్త టెక్నాలజీతో డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన ఈ మహానాడుకు కార్యకర్తల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. 11 వేల 200 మంది భాగస్వామ్యంతో కోవూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలిచింది” అని స్థానిక నేతలు పేర్కొన్నారు.నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్ పసుపు తోరణాలు, ఫ్లెక్సీలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో జరిగిన ఈ వేడుకల్లో మహిళా కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, రాష్ట్రస్థాయిలో రికార్డు సాధించడంతో కోవూరు టిడిపి శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది.


