నంద్యాల : ఎస్ఆర్బీసీ కాలనీలోని టిడ్కో గృహాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, టిడ్కో, మున్సిపల్ అధికారులతో కలిసి పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.టిడ్కో గృహాల పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిర్ణీత గడువులోగా లబ్ధిదారులకు ఇళ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.

టిడ్కో గృహాలను పరిశీలించిన కలెక్టర్ : రాజకుమారి గనియా