Sunday, 2 August 2026
  • Home  
  • జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వాహనాల తనిఖీలు
- తిరుపతి

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వాహనాల తనిఖీలు

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు – *డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి.* – *ప్రజల ప్రాణ రక్షణ, రహదారి ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం.* *- నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.* తిరుపతి, ఆగస్టు 01( పున్నమి ప్రతినిధి) తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ప్రత్యేక వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం తదితర అంశాలను తనిఖీ చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రెత్ అనలైజర్ ద్వారా పరీక్షించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన వాహనాలతో సంచరించడం వంటి ఉల్లంఘనలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తూ ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* మాట్లాడుతూ, “మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కేవలం వాహనం నడిపే వ్యక్తి మాత్రమే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక తనిఖీలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా సురక్షిత ప్రయాణాన్ని అలవర్చుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు

– *డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి.*

– *ప్రజల ప్రాణ రక్షణ, రహదారి ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యం.*

*- నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు.*

తిరుపతి, ఆగస్టు 01( పున్నమి ప్రతినిధి)

తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ప్రత్యేక వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం తదితర అంశాలను తనిఖీ చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రెత్ అనలైజర్ ద్వారా పరీక్షించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
అదేవిధంగా అతివేగంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన వాహనాలతో సంచరించడం వంటి ఉల్లంఘనలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తూ ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఈ సందర్భంగా తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* మాట్లాడుతూ, “మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కేవలం వాహనం నడిపే వ్యక్తి మాత్రమే కాకుండా అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్య డ్రైవింగ్, అతివేగం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న ప్రత్యేక తనిఖీలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకుండా సురక్షిత ప్రయాణాన్ని అలవర్చుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల సహకారంతోనే ప్రమాద రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.