Sunday, 20 September 2026
  • Home  
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
- వరంగల్

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

ప్రజా పోరాటాలతో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పలికి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన వీరుల స్ఫూర్తితో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కొనియాడారు ఈ విలీన చరిత్రను మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య మొస్తే మన తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛ వచ్చిందన్నారు నాటి భారత దేశ హోం మంత్రి కాంగ్రెస్ అగ్రనేత సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న ఉక్కు నిర్ణయం నడిపించిన ఆపరేషన్ పోలో వల్లే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని కాబట్టి తెలంగాణను భారతదేశంలో భాగం చేసిన ఘనత ఆ చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు కానీ ఈ రోజు కొందరు ఈ చారిత్రక ఘట్టాన్ని కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం వాడుకుంటూ మతాల మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విద్వేష రాజకీయాలకు తావివ్వదు అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజును నిజాం అణచివేత ముగిసి ప్రజల చేతికి అధికారం వచ్చిన రోజుగా భావిస్తూ అధికారికంగా ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని అన్నారు గత పదేళ్లలో తెలంగాణలో మరో రకమైన నిరంకుశ పాలన సాగింది కానీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు నాడు నిజాంకు వ్యతిరేకంగా రజాకార్ల క్రూరత్వానికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, వేముల సంధ్య సాంబయ్య గౌడ్, శివరాత్రి స్వామి, మండల శ్రీదేవి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

ప్రజా పోరాటాలతో నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పలికి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ నేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన వీరుల స్ఫూర్తితో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని కొనియాడారు ఈ విలీన చరిత్రను మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య మొస్తే మన తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత అంటే 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛ వచ్చిందన్నారు నాటి భారత దేశ హోం మంత్రి కాంగ్రెస్ అగ్రనేత సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న ఉక్కు నిర్ణయం నడిపించిన ఆపరేషన్ పోలో వల్లే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని కాబట్టి తెలంగాణను భారతదేశంలో భాగం చేసిన ఘనత ఆ చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు కానీ ఈ రోజు కొందరు ఈ చారిత్రక ఘట్టాన్ని కేవలం ఓట్ల కోసం రాజకీయం కోసం వాడుకుంటూ మతాల మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విద్వేష రాజకీయాలకు తావివ్వదు అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజును నిజాం అణచివేత ముగిసి ప్రజల చేతికి అధికారం వచ్చిన రోజుగా భావిస్తూ అధికారికంగా ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని అన్నారు గత పదేళ్లలో తెలంగాణలో మరో రకమైన నిరంకుశ పాలన సాగింది కానీ ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు నాడు నిజాంకు వ్యతిరేకంగా రజాకార్ల క్రూరత్వానికి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నానని అన్నారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి, ఏపూరి శ్రీనివాస్ రెడ్డి, వేముల సంధ్య సాంబయ్య గౌడ్, శివరాత్రి స్వామి, మండల శ్రీదేవి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.